News August 14, 2024

శ్రీహరికోట: కల నెరవేర్చుకున్న డిప్యూటీ సీఎం పవన్

image

శ్రీహరికోట సందర్శనతో తన చిన్ననాటి కల నెరవేరిందని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ చెప్పారు. షార్‌లో జరిగిన జాతీయ అంతరిక్ష ఉత్సవాల్లో పవన్‌ పాల్గొన్నారు. షార్ డైరెక్టర్ రాజరాజన్ చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగ నమూనాను పవన్‍కు బహూకరించారు. అనంతరం అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పవన్‍ బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు.

Similar News

News September 8, 2024

వేమిరెడ్డిని అభినందిస్తూ సీఎం లేఖ

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఇటీవల భారీ వరదలతో అతలాకుతలమైన బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళం అందించిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం భారీ విరాళం అందించిన వేమిరెడ్డిని అభినందిస్తూ ప్రత్యేకంగా లేఖను విడుదల చేశారు.

News September 8, 2024

నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న చవితి వేడుకలు

image

నెల్లూరు జిల్లాలో వినాయక చవితి సందర్భంగా రెండో రోజూ సందడి నెలకొంది. ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాలలో ఉట్టి ఉత్సవాలను యువత కోలాహలంగా జరుపుకున్నారు. నాయుడుపేట ముస్లిం వీధిలో అక్కడి ముస్లింలతో పాటు హిందువుల సైతం మతసామరస్యానికి ప్రతీకగా వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఉట్టి కార్యక్రమంలో యువత, మహిళలు, చిన్నారులు సైతం పాల్గొని రంగులు చల్లుకుంటూ ఉట్టిని కొట్టారు.

News September 8, 2024

నెల్లూరు: అంగన్వాడీలకు 4నెలలుగా అందని కందిపప్పు

image

నెల్లూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు నాలుగు నెలలుగా కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని 12 ప్రాజెక్టుల పరిధిలో 2934 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో లక్ష 25వేలు మంది చిన్నారులు, 25వేలు గర్భవతులు బాలింతలు కలరు. వీరికి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంలో కందిపప్పు అందించాల్సి ఉంది. కందిపప్పు సరఫరా లేకపోవడంతో కేంద్రాల్లో ఆకుకూరలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు.