News December 29, 2024

శ్రీహరికోట: రేపు పీఎస్ఎల్వీ C-60 ప్రయోగం

image

శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు PSLV- C60 రాకెట్‌ను ప్రయోగించనున్నన్నట్లు ఆదివారం పలువురు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రాకెట్ ద్వారా 440 కిలోల బరువు కలిగిన స్పాడెక్స్ పేరుతో జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. కక్ష్యలోకి వెళ్లిన ఉపగ్రహాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండి సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. దీనివల్ల భారత్‌ డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశం అవుతుందన్నారు.

Similar News

News January 17, 2025

నెల్లూరు: గుండెపోటుతో MLA తమ్ముడి మృతి

image

వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు కురుగొండ్ల శేఖర్ కన్నుమూశారు. డక్కిలి మండలం కమ్మవారిపల్లికి చెందిన శేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గుంటూరులో స్థిరపడ్డారు. ఈక్రమంలో నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వెంటనే గుంటూరుకు బయల్దేరారు.

News January 17, 2025

టౌన్ ప్లానింగ్‌లో నూతన సంస్కరణలు అమలు: మంత్రి 

image

దేశంలో ఎక్కడా లేనివిధంగా పట్టణాభివృద్ధి, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో నూతన సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులుతో కలిసి సమీక్షించారు.

News January 16, 2025

రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది: కాకాణి

image

రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం పొదలకూరు మండల పరిధిలోని పులికల్లు, నేదురుమల్లి, వెలికంటి పాలెం, శాంతినగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన ఇష్టా గోష్టి నిర్వహించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటానని తెలిపారు.