News August 13, 2024
శ్రీహరి కోటలో పవన్‌కు ఘన స్వాగతం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరి కోటకు చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా రేణిగుంట నుంచి వచ్చిన ఆయనకు షార్ శాస్త్రవేత్తలు ఘన స్వాగతం పలికారు. మరికొద్దిసేపట్లో శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సందర్శించనున్నారు. తర్వాత అక్కడ శాస్త్రవేత్తలు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Similar News
News September 19, 2024
జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక చర్యలు: కలెక్టర్
నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను పరిశ్రమల శాఖ జీఎం సుధాకర్ కమిటీ సభ్యులకు వివరించారు.
News September 19, 2024
నెల్లూరు: 15 మంది YCP కార్పొరేటర్లు TDPలో చేరిక
నెల్లూరు నగరానికి చెందిన 15 మంది YCP కార్పొరేటర్లు, నుడా మాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో TDPలో చేరారు. వీరికి నారా లోకేశ్ పసుపు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, రూప్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.
News September 19, 2024
Way2News: నెల్లూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను
నెల్లూరు జిల్లాలోని పలు మండలాలకు Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. ఏదైనా ఛానల్, పేపర్‌లో పనిచేస్తున్నవారు, గతంలో ఏదైనా ఛానల్, పేపర్‌లో పని చేసి మానేసిన వారు అర్హులు. ఈ <