News November 14, 2024

శ్రీ చైతన్య కాలేజీలో కామారెడ్డి విద్యార్థి ఆత్మహత్య

image

హైదరాబాద్‌లోని నిజాంపేట్ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకున్న విద్యార్థి జస్వంత్ గౌడ్ బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం విద్యార్థులు లేచి చూసేసరికి జస్వంత్ మృతి చెంది ఉన్నట్లు సిబ్బంది వెల్లడించారు. మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు.

Similar News

News November 15, 2024

బీబీపేట్: ‘గ్రూప్4లో సత్తా చాటిన యువకుడు’

image

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని యాడారం గ్రామానికి చెందిన దుర్గప్రసాద్ గురువారం ప్రకటించిన గ్రూప్-4 తుది ఫలితాలలో సత్తాచాటాడు. రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపిక అయ్యాడు. అయితే ఇది వరకే ఈ యువకుడు పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే, ఈ పరీక్షకి సన్నద్ధమైనట్లు దుర్గప్రసాద్ తెలిపాడు. 

News November 15, 2024

NZB: ‘విఫలమైన రైస్ మిల్లర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి’

image

ధాన్యం కేటాయింపులకు అనుగుణంగా మిల్లింగ్ జరిపి బియ్యం నిల్వలను తిరిగి అందించడంలో విఫలమైన రైస్ మిల్లర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణా రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ లెవీ లక్ష్యానికి విఘాతం కల్పించిన మిల్లర్లపై అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయోగించాలని అన్నారు. డిఫాల్టర్లుగా లేని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించాలని సూచించారు.

News November 14, 2024

బాన్సువాడ: రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి:పోచారం

image

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష జరిపి మాట్లాడుతూ సిద్ధాపూర్ రిజర్వాయర్ తన ఆశయమని, ఈ ప్రాంతంలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా నీళ్ళు అందాలన్నారు.