News January 24, 2025

శ్రీ బోరంచ నల్ల పోచమ్మ దివ్య దర్శనం

image

మానూర్ మండలంలోని బోరంచ నల్ల పోచమ్మను శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. మంజీర జలాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు ధరించి హారతి పాటతో నక్షత్ర హారతి ఇచ్చారు. భక్తులు అధికసంఖ్యలో హాజరై దర్శించుకున్నారు. చుట్టూపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అధికంగా వచ్చారు.

Similar News

News October 23, 2025

రాకియా పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా

image

TG: వాన్‌పిక్ వ్యవహారంలో వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌పై రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్‌‍మెంట్ అథారిటీ(RAKIA) దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు(HYD) విచారించింది. తమకు రూ.600 కోట్లు చెల్లించాలన్న రస్ అల్ ఖైమా కోర్టు ఆదేశాలు అమలు చేయాలని రాకియా పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను త్వరగా తేల్చాలని ఇటీవల TG హైకోర్టు ఆదేశించింది. రాకియా ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.

News October 23, 2025

పెద్దపల్లి: రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు డ్రా ప్రకటన

image

2025-27 రిటైల్ మద్యం దుకాణాల (A4 లిక్కర్ షాపులు) కేటాయింపుల కోసం డ్రా అక్టోబర్ 27న ఉదయం 11 గంటలకు పెద్దపల్లి బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి మహిపాల్ రెడ్డి ప్రకటించారు. కమిషనర్ ఆదేశాల మేరకు జరిగే ఈ డ్రాకు దరఖాస్తుదారులు విధిగా హాజరై సహకరించాలని కోరారు. షాపుల కేటాయింపులో పారదర్శకతకై ఈ డ్రా చేపడుతున్నట్లు వివరించారు.

News October 22, 2025

బాధితుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి: కలెక్టర్

image

కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం వేగంగా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సూచనలను షెడ్యూల్ కులాలు, తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె తెలిపారు. సీఎం SP వినీత్‌తో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, బాధితుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడానికి అధికారులను కట్టుబడి పనిచేయాలన్నారు.