News March 18, 2025

శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఫాల్గుణ మాసం మంగళవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

Similar News

News September 18, 2025

బీడీ కార్మికుల పిల్లలకు మరో అవకాశం..!

image

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడగించినట్లు జగిత్యాల బీడీ కార్మికుల దవాఖానా మెడికల్ ఆఫీసర్ డా.శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పాఠశాల పేరు పోర్టల్లో కనిపించకపోతే సమస్యలను wclwohyd@nic.inకు పంపాలన్నారు. సందేహాలుంటే 9966621170కు కాల్ చేయవచ్చన్నారు.

News September 18, 2025

ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరిగే ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.

News September 18, 2025

2027 గోదావరి పుష్కరాల కోసం ధర్మపురిలో ఏర్పాట్లు ప్రారంభం

image

2027లో మొదలయ్యే గోదావరి పుష్కరాల కోసం ధర్మపురిలో ముందస్తు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి మాస్టర్ ప్లాన్, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం, పుష్కర ఘాట్ల అభివృద్ధిపై బుధవారం సమీక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులు, రోడ్లు, పార్కింగ్, నీరు, వైద్య సేవలపై సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.