News March 19, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఫాల్గుణ మాసం బుధవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
Similar News
News November 20, 2025
భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు శిక్ష: DSP

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2022లో నమోదైన వేధింపుల కేసులో నిందితుడు కలిశెట్టి వీరబాబుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు DSP గోవిందరావు తెలిపారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు మద్యం మత్తులో శారీరక, మానసిక వేధింపులు చేసిన భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. సాక్ష్యాలు రుజువుకావడంతో JFCM స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి. బుజ్జి శిక్ష ఖరారు చేశారని చెప్పారు.
News November 20, 2025
నితీశ్ రికార్డు.. బిహార్ సీఎంగా పదోసారి

బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. రికార్డు స్థాయిలో 10వ సారి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2000 మార్చిలో కేవలం వారం రోజులే నితీశ్ సీఎంగా ఉన్నారు. తర్వాత 2005 నుంచి జరిగిన 5 ఎన్నికల్లోనూ ఇతర పార్టీల పొత్తుతో గెలిచి అధికారం చేపట్టారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేశారు. ఇటు NDAతో, అటు MGBతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలగడం ఆయన స్పెషాలిటీ.
News November 20, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


