News March 23, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఫాల్గుణ మాసం ఆదివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
Similar News
News November 27, 2025
ఎల్లారెడ్డి: అనుమానిస్తున్నాడని భర్తను చంపేసింది

ఎల్లారెడ్డిలో నిత్యం అనుమానంతో వేధిస్తున్నాడని <<18394792>>భర్తను భార్య హత్య చేసిన విషయం తెలిసిందే.<<>> SI మహేష్ వివరాల ప్రకారం.. బాలాజీనగర్ తండా వాసి తుకారాం(36) కొన్ని రోజులుగా తన భార్య మీనాపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 25న రాత్రి మీనా దిండుతో అదిమి తుకారాన్ని హత్య చేసింది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 27, 2025
ఫైబర్ ఎంత తీసుకోవాలంటే..

మన శరీరానికి పీచు తగిన మొత్తంలో అందితేనే ఆకలి, ట్రైగ్లిజరాయిడ్స్ అదుపులోకి వస్తాయి. తద్వారా బరువు తగ్గే అవకాశాలూ ఎక్కువ. దంపుడు బియ్యం, గోధుమ, జొన్న, సజ్జ రవ్వలు, ఓట్స్, రాజ్మా, శనగల నుంచి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి రోజులో 25-48గ్రా. వరకూ పీచు కావాలి. ఎత్తు, బరువు, అనారోగ్య సమస్యలు, రోజువారీ ఆహారపు అలవాట్లను బట్టి ఎంత ఫైబర్ తీసుకోవాలనేది వైద్యులు సూచిస్తారు.
News November 27, 2025
ADB: మూడు నెలల్లో నలుగురు గర్భిణుల మృతి

వైద్యుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక గర్భిణుల మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత మూడు నెలల్లో సిరికొండలో ఏత్మబాయి, ఇచ్చోడలో అనురాధ, గుడిహత్నూర్లో రుక్మాబాయి, ఆమె బిడ్డ, రోడ్డు, సిగ్నల్ సరిగా లేక సోమవారం ఉట్నూర్లో జంగుబాయి, ఆమె బిడ్డ మృతి చెందారు. గిరిజనులకు కనీస సౌకర్యాలు అందించకపోవడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.


