News March 23, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఫాల్గుణ మాసం ఆదివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
Similar News
News April 22, 2025
AP న్యూస్ రౌండప్

* అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై డీపీఆర్ తయారీకి ADCL నిర్ణయం
* వచ్చే నెల 6 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
* మద్యం కుంభకోణం కేసు.. రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి
* ఈ నెల 28న గుంటూరు మేయర్, కుప్పం, తుని, పాలకొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలకు ఎన్నికలు.. వేర్వేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు జారీ
* బోరుగడ్డ అనిల్‌పై అనంతపురంలో కేసు.. ఈ నెల 30కి విచారణ వాయిదా
News April 22, 2025
కొత్తపేట: జగన్‌ను కలిసిన జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి

ఇటీవల కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మంగళవారం తాడేపల్లిలో మాజీ సీఎం వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వైయస్ జగన్‌ను సత్కరించి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. అనంతరం కోనసీమ జిల్లాలో వైసీపీని మరింతంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగ్గిరెడ్డికి సూచించనట్లు నాయకులు వెల్లడించారు.
News April 22, 2025
సిద్దిపేట: ఈతకు వెళ్లి యువకుడు మృతి

చెరువులోకి ఈతకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. మండలంలోని పెద్ద చీకోడు గ్రామానికి చెందిన తౌడ బాబు(22) కమ్మరపల్లి పెద్ద చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందాడని తెలిపారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.