News March 29, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి దర్శనం

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ మాసం శనివారం అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు విశేష పూజలు, హారతి ఇచ్చి భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ్ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబంది, భక్తులు ఉన్నారు.
Similar News
News April 3, 2025
నిజామాబాద్: జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. బుధవారం గోపనపల్లెలో 37.6℃ నమోదైంది. వైల్పూర్ 37.3, మోస్రా 37.2, పెర్కిట్ 37, కోటగిరి 36.8, వేంపల్లి 36.6, యర్గట్ల, యడపల్లి 36.5, లక్ష్మాపూర్ 36.3, మల్కాపూర్ 36.2, ముప్కాల్, నిజామాబాద్ 36.1, ఆలూరు, బాల్కొండ 36, మెండోరా, భీంగల్, ఇస్సాపల్లి 35.9, మగ్గిడి 35.7℃ నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి.
News April 3, 2025
ఒంగోలు: 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన ఒంగోలులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. నానమ్మ వద్ద ఉంటున్న బాలికకు యువకుడు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. బాలికకు అనారోగ్యంగా ఉండటంతో జీజీహెచ్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు గర్భవతిగా తేల్చారు. దీంతో బాలిక నానమ్మ ఒంగోలు వన్ టౌన్లో ఫిర్యాదు చేసింది.
News April 3, 2025
జగిత్యాల జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. బుధవారం బుద్దేష్పల్లిలో 37.5℃ నమోదైంది. నేరెల్లా 37.2, మల్లాపూర్ 37.1, మారేడుపల్లి 37, వెల్గటూర్ 36.9, సారంగాపూర్ 36.8, అల్లీపూర్ 36.7, జగ్గసాగర్ 36.5, గొల్లపల్లె 36.4, గోదూరు 36.3, ఐలాపూర్లో 36.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ ప్రభావం తక్కువగానే ఉంది. వాతవరణం చల్లగా ఉంది.