News April 10, 2025

శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం గురువారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

Similar News

News October 14, 2025

కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు ధర్మపురి విద్యార్థి

image

ఎస్జీఎఫ్ (SGF) రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడా పోటీలకు ధర్మపురి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థి ఎం.అఖిల్ ఎంపికయ్యాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న అఖిల్, 14 సంవత్సరాల విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా రేపు జరిగే పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అఖిల్‌కు ZP ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ ఏ. స్వప్న మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు.

News October 14, 2025

ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ సెమీస్ వెళ్లాలంటే?

image

SA, AUS చేతిలో ఓడిపోయిన టీమ్ఇండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నెక్ట్స్ ఈనెల 19న ENG, 23న NZ, 26న బంగ్లాతో తలపడనుంది. బంగ్లా మినహా ENG, NZపై భారత రికార్డు పేలవంగా ఉంది. కానీ వీటితో చివరగా జరిగిన సిరీస్‌ల్లో INDనే పైచేయి(2-1) సాధించింది. లీగ్‌లో మిగిలిన 3 మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్లే అవకాశముంది. లేదంటే కనీసం 2 గెలిచి, మెరుగైన NRR మెయింటెన్ చేస్తే క్వాలిఫై అవ్వొచ్చు.

News October 14, 2025

జగిత్యాల: ‘జిల్లాలో జీపీఎఫ్ దరఖాస్తులు స్వీకరించాలి’

image

జగిత్యాల జిల్లా పరిషత్‌లో గత నెల రోజులుగా ఉపాధ్యాయుల జీపీఎఫ్ పార్ట్‌ఫైనల్‌, లోన్‌ఫైనల్‌, సెటిల్మెంట్ దరఖాస్తులు స్వీకరించకపోవడంపై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ప్రసాదరావు అదనపు కలెక్టర్ రాజా గౌడ్‌కు వినతిపత్రం సమర్పించి వెంటనే దరఖాస్తులు స్వీకరించి నిధులు మంజూరు చేయాలని తపస్ నాయకులు కోరారు.