News February 6, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో మాఘమాస ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు గురువారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.
Similar News
News October 28, 2025
HYD: జూబ్లీహిల్స్‌లో స్పీడ్ పెంచిన కాంగ్రెస్..!

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా నేడు ఉపఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించింది. TPCC ఇన్‌ఛార్జ్ మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొని, నేతలకు దిశా నిర్దేశం చేశారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, గ్రేటర్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. ఇక ఎన్నికల వరకు అందరూ జూబ్లీహిల్స్‌లోనే ఉంటూ ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు.
News October 28, 2025
మేడ్చల్, మల్కాజిగిరి యూనిట్లలోని మద్యం షాపులకు డ్రా

మేడ్చల్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని 118 వైన్స్ షాప్ టెండర్లకు గాను ఈరోజు జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనూ చౌదరి ఆధ్వర్యంలో డ్రా తీశారు. అదే విధంగా మల్కాజిగిరి యూనిట్ పరిధిలోని 88 వైన్స్ షాప్‌లకు గాను అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా ఆధ్వర్యంలో డ్రా తీశారు. మద్యం షాపులకు డ్రాను పీర్జాదిగూడలోని శ్రీ పళని కన్వెన్షన్ హాల్‌లో తీశారు.
News October 28, 2025
HYD: చున్నీతో గొంతు బిగించి భర్తను చంపింది..!

HYD బాలాపూర్ మండలం మీర్‌పేట్ PS పరిధిలో విజయ్ కుమార్ అనుమానాస్పద మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్‌మార్టం నివేదికలో హత్యగా నిర్ధారణ కావడంతో భార్య సంధ్య నిందితురాలని తేలింది. మద్యం తాగి, వేధించే భర్తతో నిత్యం గొడవ జరుగుతుండడంతో అక్టోబర్ 19న చున్నీతో గొంతు బిగించి చంపినట్లు సంధ్య ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.


