News January 27, 2025
శ్రీ భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

వరంగల్ లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈరోజు సోమవారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
Similar News
News February 13, 2025
చేగుంట: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు సువర్ణ

చేగుంట ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సైని సువర్ణ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు సీడీపీఓ స్వరూప, డీడబ్ల్యుఓ హైమావతి తెలిపారు. గతనెల 23, 24 తేదీలలో హైదరాబాద్ ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్‌లో ప్రతిభ చూపి ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 14 నుంచి 18 వరకు చెన్నైలో జరిగే పోటీల్లో పాల్గొంటున్నట్లు వివరించారు.
News February 13, 2025
ఫిబ్రవరి 13: చరిత్రలో ఈరోజు

1879: స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జననం (ఫొటోలో)
1913: పండితుడు, రచయిత గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం
1930: సినీ గేయ రచయిత దాసం గోపాలకృష్ణ జననం
2014: ఛాయాగ్రహకుడు, దర్శకుడు బాలు మహేంద్ర మరణం
2015: తెలుగు నవలా రచయిత పి.కేశవ రెడ్డి మరణం
☛ ప్రపంచ రేడియో దినోత్సవం
News February 13, 2025
కేటిదొడ్డి: కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో తనిఖీలు

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటక – తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. కేటిదొడ్డి మండలం నందిన్నె చెక్ పోస్టు వద్ద వెటర్నరీ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర, ఎక్సైజ్ కానిస్టేబుల్ జగదీష్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేశారు.