News January 26, 2025
శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి విద్యుత్ దీపాలతో త్రివర్ణ పతాక అలంకరణ

జనగామ జిల్లాలోని చిల్పూరు గుట్ట శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి విద్యుత్ దీపాలతో త్రివర్ణ పతాక అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు బుగులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
Similar News
News February 14, 2025
రాంబిల్లి: బాలికపై లైంగిక దాడి

అనకాపల్లి జిల్లాలో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రాంబిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికను సేనాపతి నాగేంద్ర (20) అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఈనెల 10వ తేదీన జరగ్గా పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు గురువారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడిని కోర్టులో హాజరు పరిచినట్లు రాంబిల్లి సీఐ సీహెచ్ నర్సింగరావు తెలిపారు.
News February 14, 2025
తుని: దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్‌కి పితృవియోగం

ప్రముఖ సినీ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ తండ్రి ఏలేటి సుబ్బారావు (73) అనారోగ్యంతో మృతి చెందారు. కాకినాడ జిల్లా తుని మండలం రేఖవానిపాలెం గ్రామంలో గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సంగీత దర్శకుడు, మృతుని బంధువులైన ఎంఎం కీరవాణి, రాజమౌళి సతీమణి తదితరులు గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
News February 14, 2025
రంగరాజన్‌పై దాడి.. తల్లాడకి చెందిన నలుగురి అరెస్ట్

హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో తల్లాడ మండలానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంజనాపురానికి చెందిన భూక్యా శ్రీను, అంకోలు శీరిష, వెంకట్రామునితండాకు చెందిన భూక్యా గోపాల్ రావు, నారయ్యబంజరకు చెందిన బానోత్ బేబీరాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.