News January 5, 2025
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ఫలితాలు విడుదల

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది జూన్లో రెగ్యులర్ డిగ్రీ (UG) BA/B.COM/BSC/BCA/BBA/B.VOC రెండో సెమిస్టర్ జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Similar News
News September 17, 2025
జమ్మలమడుగు: వయోవృద్దులకు న్యాయం చేసిన RDO

తమ జీవితకాలంలో సంపాదించిన ఆస్థిని వారసులకు దానంచేసి, చిత్రహింసకు గురవుతున్న వయోవృద్ధులకు జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ న్యాయం చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చియ్యపాడుకు చెందిన కృష్ణారెడ్డి జమ్మలమడుగుకు చెందిన బాలమ్మ, దువ్వూరుకు చెందిన మహమ్మద్ గౌస్లు తమ ఆస్థిని వారసులకు రాసిచ్చారు. వారసులు పోషణను పట్టించుకోకపోవడంతో బాధితులు ఆర్డీఓను ఆశ్రయించారు. RDO ఆస్తి తిరిగి పెద్దలకు వచ్చేలా చేశారు.
News September 16, 2025
కడప: మెగా DSC.. 32 పోస్టులు ఖాళీ

మెగా DSCకి సంబంధించి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి కడప జిల్లాలో 712 పోస్టులకు గాను 680 పోస్టులు భర్తీ అయినట్లు విద్యాశాఖ తెలిపింది. వివిధ కారణాల చేత మిగిలిన పోయిన 32 పోస్టులను వచ్చే DSCలో చేర్చనున్నారు. ఈ నెల 19న ఎంపికైన వారికి నియామకపత్రాలు అందిస్తారు. శిక్షణ తర్వాత పాఠశాలలు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.
News September 16, 2025
మైదుకూరు: ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

మైదుకూరు పట్టణం సాయినాథపురం గ్రామానికి చెందిన రమేశ్ అనే యువకుడు ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందాడు. రమేశ్ తన ఇంటి అవసరాల కోసం ఫైనాన్స్ కంపెనీ వద్ద రుణం తీసుకున్నాడు. రుణాలు చెల్లించకపోవడంతో కంపెనీ సిబ్బంది ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడిని తట్టుకోలేక ఈ అఘాయిత్యనికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.