News January 5, 2025

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ఫలితాలు విడుదల

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది జూన్‌లో రెగ్యులర్ డిగ్రీ (UG) BA/B.COM/BSC/BCA/BBA/B.VOC రెండో సెమిస్టర్ జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

Similar News

News January 14, 2025

బద్వేల్: సంక్రాంతి పండుగ రోజు విషాదం

image

బద్వేలు మండలం గుండంరాజుపల్లె సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై నుంచి అదుపుతప్పి ఇద్దరు కింద పడ్డారు. దీంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై రవికుమార్ విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 14, 2025

నలుగురికి పునర్జన్మనిచ్చిన ప్రొద్దుటూరు వాసి

image

ప్రొద్దుటూరు మండలం గోపవరానికి చెందిన గోపిరెడ్డి రాజశేఖర్‌‌రెడ్డి(53) బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాజశేఖర్‌‌ ఈనెల 1న బైక్ పైనుంచి పడి అపస్మారక స్థితికి వెళ్లారు. 11 రోజుల చికిత్స అనంతరం వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. దీంతో అతని భార్య శ్రీదేవి అవయవదానానికి సహకరించారు. దీంతో అతని అవయవాలతో నలుగురికి పునర్జన్మను కల్పించారు.

News January 14, 2025

పులివెందులలో జోరుగా కోళ్ల పందేలు

image

సంక్రాంతి పండగను పురస్కరించుకుని పులివెందులలో తొలిసారి జోరుగా కోళ్ల పందేలు సాగుతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీలోని ఉలిమెల్ల, మండలంలోని ఈ.కొత్తపల్లి, ఎర్రిపల్లె తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. ఈ పందేల్లో తొలిరోజే రూ.2 కోట్లకు పందేలు జరిగినట్లు తెలుస్తోంది. పులివెందులలో 8 చోట్ల బరులు ఏర్పాటు చేయగా.. లింగాల మండలంలోనే దాదాపు రూ. 50 లక్షలకు పందేలు జరిగినట్లు సమాచారం.