News April 13, 2025
శ్రీ సత్యసాయి: ఆలయ భూకబ్జాపై EO సీరియస్

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలలోని గుడిపల్లి సజ్జ గంటి రంగనాథస్వామి ఆలయ భూమిని సర్పంచ్ కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన గ్రామస్థులు శనివారం కబ్జాను అడ్డుకున్నారు. సర్వే ప్రకారం గ్రామస్థులు ఆ భూమికి చుట్టూ రాళ్లు పాతారు. సర్పంచ్ రాత్రి ఆ రాళ్ళను తొలగించారు. విషయం తెలుసుకున్న EO ఈశ్వర్ దేవాలయ భూమిని పరిశీలించి, బోర్డును వేసి ఈ భూమిలోకి ఎవరైనా వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News March 15, 2026
విశాఖ: టెన్త్ పరీక్షలు రాసేవారికి బస్సులో ఉచిత ప్రయాణం

పదో తరగతి పరీక్షల దృష్ట్యా, విద్యార్థులు హాల్ టికెట్ చూపి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని విశాఖ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ప్రకటించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News March 15, 2026
గ్యాస్ కోసం ఆందోళన అవసరం లేదు: విశాఖ జేసీ

విశాఖ జిల్లాలో గ్యాస్ కొరత లేదని జేసీ విద్యాధరి ఆదివారం తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం గ్యాస్ బుకింగ్‌నకు రోజువారీ అవసరము 18,184 సిలిండర్‌లు కాగా 37,920 సిలిండర్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ కొరతపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్ బుకింగ్ చేసుకోవాలనన్నారు. కేవలం పుకార్ల వల్ల మాత్రమే బుకింగ్స్ పెరిగాయని ఆమె పేర్కొన్నారు.
News March 15, 2026
నిబంధనల మేరకు పక్కాగా సర్వే నిర్వహించాలి: కలెక్టర్

ప్రభుత్వం సూచించిన విధంగా నిబంధన ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారులు పక్కాగా సర్వే నిర్వహించి, జనాభా గణన చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో జనాభా లెక్కలు – 2027, శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు. మొదటి దశ హౌసింగ్ లిస్ట్ మే 11 నుంచి జూన్ 9, రెండో దశ 2027 ఫిబ్రవరిలో జరుగుతుందన్నారు. మార్చి 1, 2027 రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తామన్నారు.


