News April 3, 2024
శ్రీ సత్యసాయి: ఉపాధ్యాయుడి సస్పెండ్

చిలమత్తూరు మండల పరిధిలోని వడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రంగారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీఈఓ మీనాక్షి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ ఎంఈఓ నాగరాజు మంగళవారం తెలిపారు. ఆదివారం చేనేపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడాన్ని కలెక్టర్ అరుణ్‌కుమార్ తీవ్రంగా పరిగణించారు.
Similar News
News October 2, 2025
ఉరవకొండలో గొంతు కోసుకున్న వ్యక్తి

ఉరవకొండలోని పాల్తూరు రోడ్డు సమీపంలోని పొలాల్లో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అత్యవసర వాహనాలకు సమాచారం అందించారు. వాహనాలు అందుబాటులోకి రాకపోవడంతో స్థానిక చారిటబుల్ ట్రస్ట్ అధినేతే కేశన్న తన సొంత వాహనంలో క్షతగాత్రుడిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 2, 2025
కంపెనీల పెట్టుబడులకు ఉత్తరం వైపు అనంతపురం ఉంది: మంత్రి లోకేశ్

ORR రోడ్ శిథిలమవుతున్న పరిస్థితి, ట్రాఫిక్ సమస్యలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోపాల కారణంగా చాలా కంపెనీలు ఇప్పుడు ఉత్తర బెంగళూరు, వైట్‌ఫీల్డ్ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నాయని క్రిస్టియన్ మ్యాథ్యూ ఫిలిప్ ట్వీట్ చేశారు. దీనికి మంత్రి లోకేశ్ ‘ఉత్తరం బాగుంది. కొంచెం ఉత్తరం వైపు అనంతపురం ఉంది. అక్కడ మనం ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ మరియు రక్షణ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నాం’ అని బదులిచ్చారు.
News October 2, 2025
నిజాంను సురక్షితంగా తీసుకొస్తాం: మంత్రి లోకేశ్

అనంతపురానికి చెందిన నిజాంను ఇండియాకు రప్పించేందుకు తన టీం ఫాలో అప్ చేస్తుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘నిజాం దుస్థితి నన్ను తీవ్రంగా కలచివేసింది. అతన్ని సురక్షితంగా భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి, అతని కొడుకుకు వైద్య సహాయం అందించడానికి నేను అన్ని విధాలుగా సహాయం చేస్తానని హామీ ఇస్తున్నా’ అని పేర్కొన్నారు. నిజాం సౌదీకి వెళ్లి ఇబ్బందులు పడుతూ తనను కాపాడాలని వేడుకున్న విషయం తెలిసిందే.