News February 24, 2025
శ్రీ సత్యసాయి: కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తామన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Similar News
News March 16, 2025
ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తప్పదా?

నూజివీడులో 32 వార్డులు ఉన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో YCP 25 చోట్ల గెలవడంతో ఛైర్‌పర్సన్‌గా త్రివేణి దుర్గా ఎన్నికయ్యారు. ఇటీవల 10మంది కౌన్సిలర్లు TDPలోకి రావడంతో ఆ పార్టీ బలం 17కి చేరింది. దీంతో ప్రస్తుత ఛైర్‌పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి.. ఆ పదవిని తమ ఖాతాలో వేసుకోవడానికి TDP ప్రయత్నిస్తోంది. ఇది జరగాలంటే 22 మంది మద్దతు అవసరం కాగా.. మిగిలిన 5మంది కౌన్సిలర్ల కోసం టీడీపీ ఎదురు చూస్తోంది.
News March 16, 2025
HYD: శ్రీరాములు పేరిట తెలుగు విశ్వవిద్యాలయం

తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును HYDలోని తెలుగు విశ్వవిద్యాలయానికి నామకరణం చేశారు. 1985లో DEC 2న నాటి CM NTR ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత దీనికి 1998లో అమరజీవి పేరు పెట్టారు. కూచిపూడిలోని సిద్దేంద్ర కళాక్షేత్రాన్ని విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు. తెలుగు ప్రజల కోసం ఆత్మబలిదానం చేసిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం.
News March 16, 2025
సూర్యాపేట: రేపు ఎస్సారెస్పీ నీటి విడుదల

సూర్యాపేట జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ఆయా కట్టుకు ఈనెల 17వ తేదీ నుంచి ఆరు తడి కింద 8 రోజులపాటు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ ఎస్ఈ శివ ధర్మ తేజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, చివరి భూములకు నీరు అందేలా సహకరించాలని సూచించారు.