News January 11, 2026

శ్రీ సత్యసాయి: కూతురి కోసం వెళ్లి తండ్రి దుర్మరణం

image

సంక్రాంతి పండుగకు కూతురిని ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లిన తండ్రి దుర్మరణం చెందారు. చెన్నేకొత్తపల్లి(M) నామాలకు చెందిన వెంకటేశ్వరరెడ్డి(38) కుమార్తె లిఖిత తిరుపతి శివారులోని తణపల్లి వద్ద చైతన్య కాలేజీలో చదువుతోంది. సెలవుల నేపథ్యంలో కూతురి కోసం వెళ్లిన వెంకటేశ్వరరెడ్డి తణపల్లి జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న విజయానంద ట్రావెల్స్ బస్సు ఢీకొని మరణించారు.

Similar News

News January 12, 2026

మంచిర్యాల: బాల కార్మికులను వినియోగిస్తే కఠిన చర్యలు

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో బాల కార్మికులను వినియోగిస్తే ఎన్నికల సంఘం బాలల పరిరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో గోడ ప్రతుల అతికింపు, ప్లెక్సీల ఏర్పాటు, కరపత్రాల పంపిణీ, ప్రచార సమయంలో ప్లకార్డుల ప్రదర్శన, సభలు, సమావేశాలలో బాలబాలికలతో పనులు చేపిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

News January 12, 2026

కోల్డ్ వేవ్స్.. వీళ్లకు ముప్పు ఎక్కువ!

image

మరికొన్నిరోజులు చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని IMD హెచ్చరించింది. దీంతో గుండె, లంగ్స్, కిడ్నీ వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ‘చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. నీరు తీసుకోవడం తగ్గుతుంది. ఉప్పు వాడకం పెరుగుతుంది. ఇవి BP, హార్ట్ అటాక్ ప్రమాదాన్ని పెంచుతాయి’ అని కార్డియాలజీ ప్రొఫెసర్ రాజీవ్ నారంగ్ తెలిపారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.

News January 12, 2026

వరంగల్: విద్యా సంస్థల నిర్మాణం వేగవంతం చేయాలి: భట్టి

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని Dy.సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీల్లో ముందు వరుసలో నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.