News January 29, 2025
శ్రీ సత్యసాయి: గ్రామాలకు వెళ్లి పల్లె నిద్రలు చేపట్టండి: ఎస్పీ

శ్రీ సత్య సాయి జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన పోలీస్ అధికారులు గ్రామాలకు వెళ్లి పల్లె నిద్రలు చేపట్టాలని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని డిఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో మాట్లాడుతూ.. పెండింగ్ కేసులలో దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు గ్రామాలకు వెళ్లి పల్లె నిద్ర చేపట్టి అక్కడ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
Similar News
News February 13, 2025
10 జీపీఏ సాధించిన వారిని విమానంలో తీసుకెళ్తా: కలెక్టర్

కేజీబీవీ విద్యార్థినులు 10వ తరగతిలో పదికి పది జీపీఏ మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె కనగల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో ముఖాముఖి నిర్వహించి.. వారితో సెల్ఫీ దిగారు. పదవ తరగతిలో 10-10 జీపీఏ సాధించిన వారిని విజయవాడ, చెన్నై లాంటి పట్టణాలకు విమానంలో తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
News February 13, 2025
కేంద్రమంత్రిని కలిసిన ఎన్టీఆర్ జిల్లా రైతులు

విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్ ప్యాకేజీ- 3కి సంబంధించిన సమస్యలను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు రైతులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరితో కలిసి వారు ఢిల్లీలో గడ్కరీని కలిశారు. ప్యాకేజీ- 3లో సర్వీస్ రోడ్ కేటాయింపు తదితర అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అధికారులతో చర్చించి ఆయా అంశాలను పరిష్కరిస్తామన్నారు.
News February 13, 2025
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్‌కు జిల్లా వాసులు

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ఈ నెల 15 నుంచి 28 వరకు కాకినాడలో జరుగునుంది. ఈ టోర్నమెంట్‌కు జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు జాకోర ZPHSకు చెందిన PET స్వామి కుమార్, డిచ్పల్లి ZPHSకు చెందిన PET స్వప్న రాష్ట్ర జట్టుకు సారథులుగా ఎంపికైయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ , SGF కార్యదర్శి నాగమణి వారిని అభినందించారు.