News May 12, 2024
శ్రీ సత్యసాయి: చెత్తకుప్పలో పసికందు మృతదేహం

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చంపి శివాపురం వీధిలోని చెత్తకుప్పలో పడేశారు. అక్కడే ఉన్న పందులు, కుక్కలు ఆ శిశువు మృతదేహాన్ని రెండు భాగాలుగా చీల్చాయి. ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 18, 2025
అనంతపురంలో చెట్టుకు ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి సూసైడ్

అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు ధర్మవరం మండలం మాలకాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
అనంతపురం జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

అనంతపురం జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం, సోమవారం 36.21°C నమోదైంది. దీంతో ఈ ఎండల్లో మంచినీళ్లతో పాటు తరచుగా ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని, కాస్త వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
News February 18, 2025
JNTUతో MOU కుదుర్చుకున్న DBLNS కంపెనీ

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను సోమవారం DBLNS కంపెనీ ప్రతినిధులు సందర్శించారు. అనంతరం విద్యార్థులకు ఉపయోగపడే లైవ్ ప్రాజెక్టులు, వర్క్ షాప్‌లు, తదితర అంశాలపై MOU కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ శంకర్, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, యూనివర్సిటీ డైరెక్టర్ సుజాత, ఈశ్వర్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్, CSE విభాగాధిపతి భారతి, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.