News February 17, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో ట్రాక్టర్ కింద పడి మహిళ మృతి

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర బైపాస్ రహదారిలో కొల్లమ్మ (45) అనే మహిళ ఇసుక ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. మడకశిర సమీప ప్రాంతాల నుంచి పట్టణంలోకి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇసుక కూలీగా పనిచేస్తున్న కొల్లమ్మ ట్రాక్టర్ ఇంజిన్‌లో కూర్చుని ప్రమాదవశాత్తు జారి ట్రాలీ వెనుక చక్రం కింద పడ్డారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Similar News
News November 22, 2025
HYDలో అతి పెద్ద పౌల్ట్రీ ఎక్స్పో

దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ ‘పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్-2025’కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 25 నుంచి హైటెక్స్‌లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ ఎక్స్పో జరగనుంది. సుమారు 50 దేశాల నుంచి 500కు పైగా ఎగ్జిబిటర్లు, 40వేల మంది సందర్శకులు హాజరుకానున్నారు. సస్టెయినబుల్ ఫీడ్, ఆటోమేషన్ వంటి అంశాలపై చర్చిస్తారు.
News November 22, 2025
పైరసీని ఎలా ఆపాలి?.. RGV సలహా ఇదే

భయం మాత్రమే పైరసీని ఆపగలదని డైరెక్టర్ RGV ట్వీట్ చేశారు. పైరసీ ఎప్పటికీ ఆగదని, దానికి కారణం టెక్నాలజీ కాదని పైరసీ చూడడానికి సిద్ధంగా ఉన్న ప్రేక్షకులే అని అభిప్రాయపడ్డారు. “సినిమా టికెట్ ధర ఎక్కువ కాబట్టి పైరసీ సరైంది అంటున్నారు. మరి నగలు ఖరీదుగా ఉంటే దుకాణాన్ని దోచుకుంటామా?” అని ప్రశ్నించారు. పైరసీని ఆపాలంటే అక్రమ లింకులు ఇచ్చేవారితో పాటు వాటిని చూస్తున్నవారిని కూడా శిక్షించాలని సూచించారు.