News February 17, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో ట్రాక్టర్ కింద పడి మహిళ మృతి

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర బైపాస్ రహదారిలో కొల్లమ్మ (45) అనే మహిళ ఇసుక ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. మడకశిర సమీప ప్రాంతాల నుంచి పట్టణంలోకి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇసుక కూలీగా పనిచేస్తున్న కొల్లమ్మ ట్రాక్టర్ ఇంజిన్‌లో కూర్చుని ప్రమాదవశాత్తు జారి ట్రాలీ వెనుక చక్రం కింద పడ్డారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Similar News
News April 19, 2026
బాపట్ల: ప్రయాణికులకు గుడ్ న్యూస్

బాపట్ల జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ రెండు కొత్త బస్సు సర్వీసులను సోమవారం ప్రారంభించనుంది. బాపట్ల నుంచి మంగళగిరి ఎయిమ్స్‌కు, చీరాల వాడరేవు నుంచి హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌కు సర్వీసులు నడుస్తున్నాయని జిల్లా ప్రజా రవాణా అధికారిణి సి.హెచ్. విమల తెలిపారు. ఈ సేవలు రోగులు, ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News April 19, 2026
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ట్వీట్లు

రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ్టి 2 ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. నిన్న సర్జరీ చేయించుకున్న Dy.CM పవన్ వేగంగా కోలుకోవాలని YCP చీఫ్ జగన్ ట్వీట్ చేయగా, పవన్ థాంక్స్ చెప్పారు. ఇక జగన్ తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా మంత్రి లోకేశ్ విషెస్ తెలిపారు. నిత్యం రాజకీయాల్లో ఉప్పు, నిప్పులా పోట్లాడుకునే నేతలు హుందాతనం చూపడం రాజకీయాల విలువలను పెంచుతాయని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
News April 19, 2026
CUET UG-2026.. మరొకొన్ని గంటలే ఛాన్స్

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG-2026) సబ్జెక్ట్ కరెక్షన్ విండో నేటితో ముగియనుంది. CUET, <


