News January 26, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో తలకిందులుగా జాతీయ జెండా

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అయితే ముదిగుబ్బ గ్రంథాలయాధికారి జెండాను తలకిందులుగా ఎగురవేసి అవమానపరిచారు. ఎంఈవో రమణప్ప, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ తుమ్మల మనోహర్ నాయుడు డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్తూ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే వారు జెండాను సరిచేసి, ఎంఈవో చేత మళ్లీ ఎగురు వేయించారు.
Similar News
News November 26, 2025
సూర్యాపేట జిల్లా ఎస్పీ గమనిక

సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా జిల్లాలో ఎన్నికల నియమావళి పటిష్ఠంగా అమలు చేస్తామని సూర్యాపేట ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు, రాజకీయ పార్టీల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News November 26, 2025
BELOPలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<
News November 26, 2025
రాజమండ్రి: గోదావరి పుష్కరాలపై ఎంపీ దగ్గుబాటి కీలక ఆదేశాలు

గోదావరి పుష్కరాల దృష్ట్యా ఎన్హెచ్–365బీబీ అప్గ్రేడేషన్ పనులను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని రాజమండ్రి ఎంపీ డాక్టర్ దగ్గుబాటి పురందీశ్వరి ఆదేశించారు. బుధవారం తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో రాజమండ్రి కలెక్టరేట్లో సమీక్షా సమావేశం జరిగింది. ప్రాజెక్ట్ పురోగతి, భూ సేకరణ, క్లియరెన్సులు, నిర్మాణ సంస్థల పనితీరుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.


