News November 25, 2024
శ్రీ సత్యసాయి జిల్లాలో నేటి నుంచి 32 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు
ఉన్నత పాఠశాలల వేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడానికి శ్రీ సత్యసాయి జిల్లాలో 32 మండలాల్లో నేటి నుంచి పైలెట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్టు డీఈవో కిష్ణప్ప తెలిపారు. 32 మండలాల్లోని పాఠశాలల్లో ఒక్కో ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి, ఆ వివరాలను ఆయా మండలాల ఎంఈవోలు, పాఠశాల హెచ్ఎంలకు పంపామన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు పాఠశాల పనివేళలను పాటించాలని ఆదేశించారు.
Similar News
News December 9, 2024
పెనుకొండలో ప్రతిభా పరీక్షకు 58 మంది గైర్హాజరు
పెనుకొండ నగర పంచాయతీ పరిధిలో జాతీయ ఉపకార వేతనాల కోసం విద్యార్థులకు ఆదివారం ప్రతిభా పరీక్షలను నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను మండల విద్యాధికారి చంద్రశేఖర్ తనిఖీ చేశారు. ఈ పరీక్షలను 4 కేంద్రాలలో నిర్వహించినట్లు మండల విద్యాధికారి తెలిపారు. నాలుగు కేంద్రాలలో మొత్తం 968 మంది అభ్యర్థులకు గానూ 910 మంది పరీక్షలకు హాజరయ్యారు. 58 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయినట్లు తెలిపారు.
News December 8, 2024
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం
శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వవచ్చునన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందన్నారు.
News December 8, 2024
అనంత జిల్లాలో 982 ఎం.వి కేసుల నమోదు
అనంతపురం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 982 ఎం.వీ కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ ఎం.వీ కేసులకు సంబంధించిన నిందితుల నుంచి రూ.2,21,625లు జరిమానా విధించారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు కేవలం ఒకరోజులోనే ప్రగతి సాధించారు. అంతే కాకుండా అలాగే ఓపెన్ డ్రింకింగ్ కేసులో 45, డ్రంకన్ డ్రైవ్ రెండు కేసులు, నమోదు చేశామన్నారు.