News February 13, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో మంటల్లో చిక్కుకొని వృద్ధుడి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షికి సమీపంలో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని మహబూబ్ బాషా అనే వృద్ధుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మహబూబ్ బాషా తన పొలం దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో తన పొలం పక్కనే ఉన్న గడ్డివాముకు నిప్పు అంటుకుంది. తన చేనులోకి మంటలు ఎక్కడ పడతాయో అన్న ఉద్దేశంతో మహబూబ్ బాషా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. పొగకు ఊపిరాడక మంటల్లో చిక్కుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 11, 2025

విద్యతోనే పేదరికం నుంచి విముక్తి: కలెక్టర్

image

మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. “విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యం” అని ఆయన తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించుకున్నారు. మతభేదాలు లేకుండా విద్యను అందించాలనే ఆజాద్ ఆశయాన్ని ప్రస్తావిస్తూ, మైనారిటీ విద్యాఅభివృద్ధికి ప్రభుత్వం గురుకులాలు, బాలికల విద్యపై ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు.

News November 11, 2025

లైసెన్స్ పొందకుండా వాహనాలు నడపొద్దు: కలెక్టర్

image

లైసెన్స్ పొందకుండా వాహనాలు నడపొద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవడమే కాకుండా కచ్చితంగా పాటించాలని సూచించారు. 18 ఏళ్ల నిండకుండా లైసెన్స్ పొందకుండానే వాహనాలు నడపొద్దని, సరైన శిక్షణ పొందకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. యువత రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు.

News November 11, 2025

మొక్కల్లో నత్రజని లోపం.. ఇలా గుర్తిద్దాం

image

మొక్క ఎదుగుదల, పూత, పిందె రావడం, కాయ పరిమాణం ఎదుగుదలలో నత్రజని కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల మొక్క పెరుగుదల, పూత, కాపు కుంటుపడుతుంది. ఆకులు చిన్నగా మారతాయి. ముదిరిన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి, పొట్టిగా, పీలగా కనిపిస్తాయి. పంట దిగుబడి తగ్గుతుంది. ఒకవేళ నత్రజని అధికమైతే కాండం, ఆకులు ముదురాకు పచ్చగా మారి చీడపీడల ఉద్ధృతి పెరుగుతుంది. పూత, కాపు ఆలస్యమవుతుంది.