News February 18, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

image

శ్రీ సత్యసాయి జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం, సోమవారం 36.21°C నమోదైంది. దీంతో ఈ ఎండల్లో మంచినీళ్లతో పాటు తరచుగా ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని, కాస్త వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News April 16, 2026

సీబీఎస్‌ఈ ఫలితాల్లో తాళ్ల పద్మావతి స్కూల్‌ సత్తా

image

సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల్లో తాళ్ల పద్మావతి పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. విద్యార్థులు అఫియా(485), నిత్య(473), కార్తిక(472), నిగ్నేశిత(469) అత్యుత్తమ మార్కులతో రాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను విద్యాసంస్థల చైర్మన్‌ తాళ్ల మల్లేశం, డైరెక్టర్లు డా.వంశీ, చైతన్య, డా.వరుణ్‌, వైష్ణవి అభినందించారు.

News April 16, 2026

సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే..!

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు వెలగపూడి సచివాలయానికి వెళ్తారు. 11.45 గంటలకు ఆర్ధిక శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం సాయంత్రం 04.00 గంటలకు దేవాదాయ శాఖపై సమీక్షిస్తారు. తిరిగి 05.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.

News April 16, 2026

వనపర్తి: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు

image

పెబ్బేరులో ప్రేమ, పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన జుర్రు మహేశ్‌పై కేసు నమోదు అయింది. ఓ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి 2021సంవత్సరం నుంచి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకొని మోసం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై పెబ్బేరు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.