News January 28, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు

శ్రీ సత్యసాయి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆదివారం నల్లమాడ మండలం చెర్లోపల్లిలో రత్న అనే మహిళ గొలుసు లాక్కెళ్లిన ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. ఓబులదేవరచెరువులో సోమవారం సాయంత్రం భార్గవి అనే మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. ఆమె తన దుకాణంలో వాటర్ బాటిల్ ఇస్తున్న క్రమంలో ఇద్దరు యువకులు చైన్ లాక్కొని బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 6, 2025
పాలేరు జలాశయంలో మత్స్యకారుడు మృతి

కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో చేపల వేటకు వెళ్లి ఎర్రగడ్డ తండాకు చెందిన బానోత్ వాల్య(65)అనే మత్స్యకారుడు మృతి చెందాడు. తండావాసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన వాల్యకు చేపల వలలు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి పోయాడు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
News December 6, 2025
బిల్వ స్వర్గం గుహల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్.!

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన ఉన్న బిళ్ళస్వర్గం గుహల వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా యూనిట్ బృందం గుహల సన్నివేశాల చిత్రీకరణ కోసం వచ్చింది. దీంతో ఈ సందర్భంగా సినిమా యూనిట్ బృందం తరలిరావడంతో గుహల్లో సందడి వాతావరణం నెలకొంది.
News December 6, 2025
ఖమ్మం: గ్రామాల్లో ‘బుజ్జగింపుల’ రాజకీయం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. తమ గెలుపుపై ప్రభావం చూపే బలమైన పోటీదారులను బ్రతిమిలాడి, బుజ్జగించి పోటీ నుంచి తప్పించేందుకు ప్రధాన అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఖర్చు ఇస్తామని ఆఫర్ చేస్తుంటే, మరికొందరు మొండిగా పోటీలో ఉంటామని చెబుతున్నారు.


