News January 28, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆదివారం నల్లమాడ మండలం చెర్లోపల్లిలో రత్న అనే మహిళ గొలుసు లాక్కెళ్లిన ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. ఓబులదేవరచెరువులో సోమవారం సాయంత్రం భార్గవి అనే మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. ఆమె తన దుకాణంలో వాటర్ బాటిల్ ఇస్తున్న క్రమంలో ఇద్దరు యువకులు చైన్ లాక్కొని బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 10, 2025

ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక: సీఎం

image

TG: ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చూడాలన్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపాలని, అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట బాధ్యతను కలెక్టర్లు, ఎస్పీలకు ఇవ్వాలని సూచించారు.

News February 10, 2025

నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

1.నిర్మల్: నిర్మల్ జిల్లాకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి2.లోకేశ్వరం: ఫోన్ విషయంలో గొడవ.. చెరువులో దూకిన మహిళ3.లక్ష్మణాచంద మండలంలో 75,281 ధాన్యం సంచులు మాయం4.భైంసాలో 40 టన్నుల పీడీఎస్ బియ్యం సీజ్5.కుబీర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు6.నిర్మల్ : బస్ డిపో వద్ద ఆటో బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు

News February 10, 2025

పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలుంటే చెప్పండి: అడిషనల్ కలెక్టర్

image

మెదక్ మండలం రాజ్‌పల్లి, హవేలీఘన్పూర్ మండలం మద్దుల్వాయి గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై అభ్యంతరాలుంటే తెలపాలని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులకు అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం గ్రామాల పోలింగ్ స్టేషన్ల ఏర్పాటులో భాగంగా వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల అభ్యంతరాలపై సమీక్షించారు. మద్దుల్వాయి, రాజ్‌పల్లి పోలింగ్ స్టేషన్ల డ్రాఫ్ట్ విడుదల చేశామన్నారు.

error: Content is protected !!