News May 3, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారు!

image

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. విజయవాడ నుంచి బయలుదేరి శనివారం ఉదయం 10.10 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10:35 గంటలకు హిందూపురంలోని ఎంజీఎం మైదానానికి హెలికాప్టర్‌లో వస్తారు. అక్కడి నుంచి బహిరంగ సభకు చేరుకుంటారు. సభ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తారు.

Similar News

News December 24, 2025

అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించాలి: కలెక్టర్ ఆనంద్

image

వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, రైతుల సమస్యల పరిష్కారానికి అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక పద్ధతుల ద్వారా సాగు ఖర్చులు తగ్గించి, రైతులకు లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు.

News December 24, 2025

అనంతపురం పార్లమెంట్ టీడీపీ కమిటీ నియామకం

image

అనంతపురం పార్లమెంట్ టీడీపీ నూతన కమిటీని బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. జిల్లా అధ్యక్షుడిగా పులా నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ చౌదరి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా లాలప్ప, రంగయ్య, మల్లికార్జున, వెంకటేశులు, ఆదినారాయణ, ప్రసాద్, కృష్ణ కుమార్, బర్డెవాలి, మర్రిస్వామి ఎంపికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

News December 24, 2025

సీఎం చంద్రబాబును కలిసిన పూల నాగరాజు

image

అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన పూల నాగరాజు మంగళవారం సెక్రటేరియట్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని నాగరాజు పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.