News March 24, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య

గాండ్లపెంట మండలం తూపల్లి పంచాయతీ వంకపల్లిలో సచివాలయ ఉద్యోగి, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 10, 2025
‘ప్రజావాణి’కి 339 దరఖాస్తులు: జిల్లా కలెక్టర్

కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 339 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. దరఖాస్తుల్లో అత్యధికంగా కరీంనగర్ నగర పాలికకు 68, హౌసింగ్ శాఖకు సంబంధించి 43 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.
News November 10, 2025
అల్లూరి జిల్లాలో 1.69లక్షలు మందికి పరీక్షలు: DEO

అల్లూరి జిల్లాలో 2904 ప్రభుత్వ పాఠశాలల్లో 1.69లక్షల మంది విద్యార్థులకు సోమవారం నుంచి సమ్మేటివ్- 1 పరీక్షలు ప్రారంభం అయ్యాయని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. పాడేరు గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో జరుగుతున్న పరీక్షను ఆయన పరిశీలించారు. ప్రతీ పాఠశాలలో క్రమశిక్షణతో పరీక్షలు నిర్వహించాలని టీచర్స్ను ఆదేశించారు. ఈ పరీక్షలు ఫలితాలు ఆధారంగా విద్యార్థికి చదువు చెప్పాలన్నారు.
News November 10, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

✦ విశాఖలో రియాల్టీ లిమిటెడ్ ఐటీ పార్క్, రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
✦ ఓర్వకల్లులో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రీస్కు 50ఎకరాలు, సిగాచీ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంటుకు 100Acre, అనకాపల్లి(D)లో డోస్కో ఇండియాకు 150Acre, అనంతపురంలో TMT బార్ ప్లాంటుకు 300Acre, నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం బిర్లా గ్రూపుకు భూమి కేటాయింపు
✦ కృష్ణా(D) బాపులపాడులో వేద ఇన్నోవేషన్ పార్క్(40Acre) ఏర్పాటు


