News March 10, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 103 మంది గైర్హాజరు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 103 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు సెట్ నంబర్ 2 ప్రశ్నాపత్రాలను వినియోగించినట్లు ఆయన పేర్కొన్నారు. 6,339 మంది విద్యార్థులకు గానూ 6,236 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.

Similar News

News October 16, 2025

PHOTO GALLERY: మోదీ ఏపీ పర్యటన

image

AP: ప్రధాని మోదీ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. తొలుత శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వార్లకు పూజలు చేశారు. అనంతరం గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, భూపతి రాజులతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. మోదీ పర్యటన ఫొటోలను పైన గ్యాలరీలో చూడండి.

News October 16, 2025

GDK: ‘బంద్‌కు జిల్లా ముదిరాజ్‌ సంఘం పూర్తి మద్దతు’

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘాలు ఈ నెల 18న ఇచ్చిన బంద్‌ పిలుపునకు పెద్దపల్లి జిల్లా ముదిరాజ్‌ సంఘం తరపున నాయకులు మద్దతు ప్రకటించారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 18న జరుగనున్న బంద్‌లో ముదిరాజ్‌ కుల బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News October 16, 2025

వనపర్తి: ‘విద్యార్థులు మంచి చెడుపై అవగాహన కలిగి ఉండాలి’

image

వనపర్తి జిల్లా శ్రీనివాసపురం ప్రాథమిక పాఠశాలలో గురువారం బాలబాలికలకు అవగాహన కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వి.రజిని ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులకు మంచి స్పర్శ, చెడు స్పర్శలు గుర్తించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కలిగించాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు, పరిశుభ్రత అంశాలపై పలు ఉదాహరణలతో వివరించారు. సిబ్బంది కృష్ణయ్య, రఘు పాల్గొన్నారు.