News March 10, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 140 మంది గైర్హాజరు.!

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెట్-2 ప్రశ్నాపత్రంతో పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈఓ రఘునాథ రెడ్డి సోమవారం తెలిపారు. పరీక్షలకు జనరల్ విద్యార్థులు 6339 మందికి గానూ.. 6236మంది, ఒకేషనల్ విద్యార్థులు 1144 మందికి గానూ 1107 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 140 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.

Similar News

News January 16, 2026

ముస్తాబైన చెరువుగట్టు.. ఈ తేదీల్లో బ్రహ్మోత్సవాలు

image

చెరువుగట్టు శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 23న నగరోత్సవంతో వేడుకలు ప్రారంభమై.. 26న కళ్యాణం, 27న అగ్నిగుండాలు, 30న గ్రామోత్సవంతో ముగియనున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవదాయ శాఖ అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

News January 16, 2026

వరుసగా అబార్షన్లు అవుతున్నాయా?

image

గర్భం దాల్చిన ప్రతిసారీ అబార్షన్ అవుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రెండోసారి అబార్షన్ జరిగితే డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని టెస్టులు చేయించి మందులు వాడాలి. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని టెస్టుకి పంపి జన్యు సమస్యలున్నాయో తెలుసుకోవచ్చు. మేనరికం అయితే దంపతులకి టెస్టులు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రక్తపరీక్షలు, స్కానింగ్ వంటివి చేసి వాటికి తగ్గ ట్రీట్‌మెంట్ చేయాలి.

News January 16, 2026

‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’

image

‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’అనేది సామెత. ఇవాళ ఎలాంటి ప్రయాణాలు చేయకూడదంటారు పెద్దలు. దీనికి కారణం పూర్వం ఎడ్ల బండ్ల మీదే ప్రయాణాలు జరిగేవి. కనుమ రోజు పశువులను పూజించి ఏడాదిలో ఈ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా బండ్లు కట్టొద్దని నిర్ణయించారు. అందుకే ఈ రోజున ప్రయాణాలు వద్దంటారు. అంతే కాకుండా భోగి, సంక్రాంతి హడావుడిగా అయిపోతాయి. అందరూ కలిసి సరదాగా గడపడం కోసం కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం వద్దంటారు.