News March 24, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 145 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 145 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. ఇవాళ మ్యాథ్స్ పరీక్ష జరగ్గా రెగ్యులర్ విద్యార్థులు 21,394 మందికి గానూ 21,283 మంది హాజరయ్యారని, ప్రైవేటు విద్యార్థులు 235 మందికి గానూ 201 హాజరయ్యారన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి.
Similar News
News October 24, 2025
రేపు 25న డయల్ యువర్ HNK డీఎం

హనుమకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ భూక్యా ధరమ్ సింగ్ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు శనివారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో డిపో అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు, సూచనలను ప్రయాణికులు 89777 81103కు ఫోన్ చేసి అందించాలని కోరారు.
News October 24, 2025
చెక్ పోస్టులను సందర్శించిన ఎస్పీ మాధవ్ రెడ్డి

ఎల్విన్ పేట, బత్తిలి పోలీసు స్టేషను పరిధిలోని చెక్ పోస్టులను శుక్రవారం మన్యం ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను క్షుణంగా పరిశీలించి ప్రతి వాహనాన్ని సక్రమంగా తనిఖీలు నిర్వహించాలని చెక్ పోస్ట్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ హరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News October 24, 2025
నిజాంసాగర్: పెరుగుతున్న వరద.. ఒక గేటు ద్వారా నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టు ఒక వరద గేటును ఎత్తి 5,497 క్యూసెక్కుల నీటిని మంజీరా నదికి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టులోకి 5,760 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుండలా మారింది.


