News March 24, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 145 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 145 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. ఇవాళ మ్యాథ్స్ పరీక్ష జరగ్గా రెగ్యులర్ విద్యార్థులు 21,394 మందికి గానూ 21,283 మంది హాజరయ్యారని, ప్రైవేటు విద్యార్థులు 235 మందికి గానూ 201 హాజరయ్యారన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి.
Similar News
News October 18, 2025
VJA: ఆకలి రాజ్యం VS GGH సూపరింటెండెంట్.!

విజయవాడ GGH సూపరింటెండెంట్ డా. AV రావుకు, ‘ఆకలి రాజ్యం’ హోటల్ నిర్వాహకులకు టెండర్ గడువు ముగింపుపై ఘర్షణ జరుగుతోంది. హోటల్ కొనసాగింపు వద్దన్నందుకు సూపరింటెండెంట్ ఇంటిపైకి యువకులను పంపి బెదిరించారని, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్వాహకులు రాజకీయ నేతలతో బుజ్జగించే ప్రయత్నం చేయడంతో కేసు నమోదు కాలేదు. గతంలోనూ ‘ఆకలి రాజ్యం’పై స్థలం ఆక్రమణ, అధిక ఛార్జీల ఆరోపణలు ఉన్నాయి.
News October 18, 2025
తురకపాలెం మరణాలపై కలెక్టర్‌కు వినతిపత్రం

తురకపాలెంలో 46 పైచిలుకు మరణాలపై వైసీపీ నాయకులు గుంటూరు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ.. నాలుగు నెలలు గడిచినా వ్యాధి నిర్ధారణ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో స్పెషలిస్టు వైద్యులు ఉండేలా క్లినిక్ ఏర్పాటు చేయాలని, మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
News October 18, 2025
DA బకాయిలు రూ.7వేల కోట్లు: సీఎం

AP: గత ప్రభుత్వం డీఏలను పెండింగ్‌లో పెట్టిందని, ఇప్పుడు రూ.7వేల కోట్ల బకాయిలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇతర రాష్ట్రాలు మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్)పై ఎక్కువ ఖర్చు చేస్తే, ఏపీలో గత ప్రభుత్వం DBTకి పెద్దపీట వేసిందని విమర్శించారు. వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.