News March 24, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 145 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 145 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. ఇవాళ మ్యాథ్స్ పరీక్ష జరగ్గా రెగ్యులర్ విద్యార్థులు 21,394 మందికి గానూ 21,283 మంది హాజరయ్యారని, ప్రైవేటు విద్యార్థులు 235 మందికి గానూ 201 హాజరయ్యారన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి.
Similar News
News April 19, 2025
వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరిక

రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మైనర్లతో పాటు ఎలాంటి లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే వారిపై చర్యలు తప్పవని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో మైనర్లను ప్రోత్సహించిన, వాహనాలు అందజేసినా యజమానులపై చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
News April 19, 2025
జనగామ: నేడు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ క్యాంపు

జనగామలో బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ క్యాంపు శనివారం నిర్వహించనున్నట్లు సబ్ డివిజనల్ ఇంజినీర్ చంద్రగిరి ప్రసాద్ తెలిపారు. ఈ క్యాంపులో బీఎస్ఎన్ఎల్ వివిధ సర్వీసులు, మొబైల్, ఇంటర్నెట్, వైఫై, సిగ్నల్ సమస్యలు పరిష్కరించబడతాయని పేర్కొన్నారు. ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా వరంగల్ ఏజీఎం దయాకర్ హాజరు అవుతారని చెప్పారు.
News April 19, 2025
ఎవరికి రూపాయి ఇవ్వనవసరం లేదు: వర్ధన్నపేట MLA

తెలంగాణ ప్రజలను కోటీశ్వరులుగా చూడాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆశయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాపాలనలో ఏ అధికారి, నాయకుడికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా డబ్బులు అడిగితే 80961 07107కి ఫిర్యాదు చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.