News April 1, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 2 కరవు మండలాలు.!

రబీ సీజన్‌లో ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాలో శ్రీ సత్యసాయి జిల్లాలో 2 మండలాలకు స్థానం లభించింది. 2024-25 రబీ సీజన్‌లో కరవు ప్రభావిత మండలాలను సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో రొద్దం మండలాన్ని తీవ్ర కరవు ప్రాంతంగా గుర్తించింది. తనకల్లు మండలాన్ని మోస్తారు పరవు ప్రభావిత మండలంగా ప్రకటించింది. 30 మండలాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.
Similar News
News April 4, 2025
పల్నాడు జిల్లాలో ఒకరి హత్య

మాచర్ల నియోజకవర్గ పరిధిలో హరిచంద్ర హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఆయన మృతదేహం పొలంలో ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా రెండు రోజుల క్రితం నాగార్జున సాగర్ హిల్ కాలనీలో హరిచంద్ర కిడ్నాప్‌కు గురయ్యారు. రెండు రోజుల తర్వాత ఆయన శవమై కనిపించారు. పోలీసులు తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. హత్యకు కుటుంబ కలహాలు కారణమా? రాజకీయా కోణమా? అనేది దర్యాప్తు చేస్తున్నారు.
News April 4, 2025
GET READY: మరో రెండు రోజుల్లో..

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. మరో రెండు రోజుల్లో ఫస్ట్ షాట్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ట్వీట్ చేసింది. ఈ విషయం తెలుపుతూ కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
News April 4, 2025
NLG: పారితోషికం కోసం ఎదురుచూపు

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే వివరాలను ఆన్‌లైన్లో పొందుపర్చిన డాటా ఎంట్రీ ఆపరేటర్లకు నేటికీ పారితోషికం అందలేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం సుమారు 3000 మందికి పైగానే డాటాఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వారికి పారితో కింద ఒక్కో ఫామ్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినందుకు రూ.25 ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ నేటి వరకు పారితోషికం అందించలేదని ఆపరేటర్లు తెలిపారు.