News March 7, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 244 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నేడు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెట్-2 ప్రశ్నాపత్రంతో పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈఓ రఘునాథరెడ్డి శుక్రవారం తెలిపారు. పరీక్షలకు జనరల్ విద్యార్థులు 9,410 మందికి గానూ 9,202 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,151 మందికి గానూ 1,114 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 244 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.
Similar News
News November 8, 2025
₹60,799Crతో రోడ్ల నిర్మాణం.. రికార్డు: మంత్రి

TG: రాష్ట్రంలో ₹60,799Crతో రోడ్లు నిర్మించనున్నట్లు మంత్రి వెంకట్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డని, RRR నిర్మాణానికి ₹36,000Cr, HYD-VJA హైవే విస్తరణకు ₹10,400కోట్లు, HAM ప్రాజెక్టుకు ₹11,399Cr కేటాయించామన్నారు. ₹8,000Crతో మన్ననూర్-శ్రీశైలం ఎలివేటర్ కారిడార్, ₹20,000Crతో ఫ్యూచర్ సిటీ-బందరు పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో డబుల్ రోడ్లు వేస్తామన్నారు.
News November 8, 2025
KTDM: ఆస్పత్రుల సేవలు భేష్.. ప్రభుత్వానికి నివేదిక

కొత్తగూడెం జిల్లాలోని టీవీవీపీ ఆసుపత్రుల సేవలు అద్భుతంగా ఉన్నాయని సీఆర్ఎం బృంద సభ్యులు డాక్టర్ జి.బి. సింగ్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు పరిశీలించిన ఇల్లందు, భద్రాచలం ఆసుపత్రులలోని వైద్య ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్నాయన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ, స్పెషలిస్ట్ వైద్య సేవలు అద్భుతంగా అందుతున్నాయని, నాణ్యమైన వైద్యం అందిస్తూ ఆసుపత్రులు భేష్ అని కొనియాడారు.
News November 8, 2025
కుప్పంలో పరిశ్రమలు ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన

కుప్పం నియోజకవర్గంలో ఏడు పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి శనివారం సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. సుమారు రూ.2200 కోట్ల పెట్టుబడితో 22 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏడు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని అన్నారు. దీనికి సంబంధించి శనివారం అమరావతి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.


