News March 26, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 252 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి ఫిజిక్స్ పరీక్షకు 262 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 227 మంది, ప్రైవేట్ విద్యార్థులు 25 మంది గైర్హాజరు అయ్యారన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో పరీక్షలు జరిగినట్లు చెప్పారు.
Similar News
News October 31, 2025
ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలి: కవిత

భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి, రైతన్నల ఆరుగాలం కష్టం నీటిపాలైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలని ఆమె కోరారు. ఎకరాకు రూ.10 వేల సాయం సరిపోదని, ఒక్కో ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని కవిత ట్వీట్ చేశారు.
News October 31, 2025
మాగంటి సునీతపై బోరబండ PSలో కేసు నమోదు

బీఆర్ఎస్ గుర్తు ఉండే ఓటర్ స్లిప్లను ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయి రామ్కు ఫిర్యాదు చేశారు. సునీతపై ఇచ్చిన ఆధారాలను గుర్తించిన రిటర్నింగ్ అధికారి బోరబండ PSలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 31, 2025
మన్యం జిల్లాలోకి మెంటాడ?

మెంటాడ మండలం పార్వతీపురం జిల్లాలో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఒక నియోజకవర్గం.. ఒకే డివిజన్లో ఉండేలా ప్రభుత్వం చూస్తోంది. ప్రస్తుతం సాలూరు నియోజకవర్గం మన్యం జిల్లాలో ఉన్నప్పటికీ.. మెంటాడ మాత్రం VZM(D) బొబ్బిలి రెవెన్యూ డివిజన్లో ఉంది. ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం మెంటాడ మండలం మన్యం జిల్లాలో కలిసే ఛాన్స్ ఉంది. అయితే దీనిని మండల వాసులు వ్యతిరేకిస్తున్నారు.


