News March 4, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 413 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మంగళవారం ఇంగ్లీష్ పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లాలో 12,162 మంది విద్యార్థులకు గానూ 11,749 విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఒకేషనల్ పరీక్షకు సంబంధించి 1,696 మంది విద్యార్థులకు గానూ 1,595 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
కరవాకలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

మామిడికుదురు మండలంలోని కరవాకలో వైనుతీయ నది తీరం వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై చైతన్య కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
చిన్నమండెం: గుండెపోటుతో టీచర్ మృతి

చిన్నమండెం మండలం చాకిబండ తెలుగు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బీవీ శ్రీధర్ రెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే తోటి ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారి మధ్యలో చనిపోయారు. ఆయన మృతి పట్ల మండల వ్యాప్తంగా ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు.
News September 18, 2025
కర్నూలు మార్కెట్ యార్డుకు నేడు, రేపు సెలవు

కర్నూలు మార్కెట్ యార్డుకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించినట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ బి.నవ్య తెలిపారు. మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, ఉల్లిని ట్రేడింగ్, బహిరంగ వేలం ద్వారా బయటకు తరలించడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇవాళ, రేపు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో ఉల్లి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.