News March 4, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 413 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మంగళవారం ఇంగ్లీష్ పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లాలో 12,162 మంది విద్యార్థులకు గానూ 11,749 విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఒకేషనల్ పరీక్షకు సంబంధించి 1,696 మంది విద్యార్థులకు గానూ 1,595 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
Similar News
News March 26, 2025
త్వరలోనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ: మంత్రి దుర్గేశ్

AP: గత ఏడాది జులైలో తూ.గోదావరి(D)లోని ఎర్రకాలువ ముంపుతో నష్టపోయిన రైతులకు మంత్రి కందుల దుర్గేశ్ శుభవార్త చెప్పారు. త్వరలోనే వారి అకౌంట్లలో ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేస్తామని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఈ అంశం చర్చకు రాగా వెంటనే నిధులు విడుదల చేయాలని CM చంద్రబాబు ఆదేశించారని పేర్కొన్నారు. కాగా భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరి జిల్లాల్లోని 20 నియోజకవర్గాల్లో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.
News March 26, 2025
ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం షార్ట్ లిస్ట్ అభ్యర్థుల జాబితా విడుదల

ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల జాబితాను https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్‌లో ఉంచినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి కె. సరస్వతి తెలిపారు. షార్ట్ లిస్టు చేయబడిన అభ్యర్థులు ఈనెల 28వ తేదీ లేదా అంతకుముందు వెబ్ ఆప్షన్ సర్వీస్ ద్వారా ఎంప్యానల్ కోచింగ్ సంస్థలకు తమ ప్రాధాన్యతలను నమోదు చేసుకోవాలని కోరారు. ఫెజ్-1 ఎంపికలకు ఎడిట్ ఆప్షన్ లేదన్నారు.
News March 26, 2025
ఉగాది వేడుకలకు రూ.5 కోట్లు విడుదల

AP: ఉగాది వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు రిలీజ్ చేసింది. పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పురస్కారాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చింది. దీని కోసం ఒక్కో జిల్లాకు రూ.10 లక్షల చొప్పున కేటాయించింది.