News March 13, 2025

శ్రీ సత్యసాయి జిల్లా: అగ్ని వీర్‌కు దరఖాస్తు చేసుకోండి

image

అగ్ని వీర్ నియామకం కోసం దరఖాస్తులు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ పేర్కొన్నారు. వివిధ కేటగిరీల అగ్ని వీర్ నియామకం కోసం ఏప్రిల్ 10వ తేదీ లోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష మొట్టమొదటిసారిగా తెలుగుతోపాటు 13 వేర్వేరు భాషల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Similar News

News March 19, 2025

తాండూర్: ఇంటి పన్ను వసూలు 74% జిల్లాలోని చివరి స్థానం

image

తాండూర్ మండల వ్యాప్తంగా 33 గ్రామపంచాయతీలో నేటి వరకు 74% ఇంటి పన్ను వసూలు అయినట్లు మండల పంచాయతీ అధికారులు తెలిపారు. 33 గ్రామపంచాయతీలో 100% కంటే తక్కువ ఇంటి పన్ను వసూలు అయిందని, మార్చి చివరి నాటికి 100% ఇంటి పన్ను వసూళ్లే లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు ముమ్మరంగా పని చేయాలని ఇప్పటికే అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలోనే చివరి స్థానంలో ఇంటి పన్ను వసూళ్లలో తాండూరు మండలం ఉంది. 

News March 19, 2025

సిరిసిల్ల: ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన గౌడ సంఘం నాయకులు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి గితేను జిల్లా గౌడ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్‌తో పాటు నాయకులు సిరిసిల్ల ప్యాక్స్ ఛైర్మన్ బండి దేవదాస్ గౌడ్, మాజీ ఏఎంసీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్, ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు బాల్ రెడ్డి, బోయిన్పల్లి మాజీ జెడ్పిటిసి పులి లక్ష్మీపతి గౌడ్, గాదగోని సాగర్ గౌడ్‌లు ఎస్పీని శాలువాతో సత్కరించి సన్మానించారు.

News March 19, 2025

పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

చిత్తూరు నగరంలోని మున్సిపల్ హైస్కూల్‌లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం పరిశీలించారు. చిత్తూరు జిల్లా అంతట పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు  స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని రకాల భద్రత చర్యలను ఏర్పాటు చేశామన్నారు.

error: Content is protected !!