News January 27, 2025
శ్రీ సత్యసాయి జిల్లా ఉత్తమ డీఎస్పీగా విజయ్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లా ఉత్తమ డీఎస్పీగా విజయ్ కుమార్ ఎంపికయ్యారు. ఆయనకు ఆదివారం పుట్టపర్తిలో జరిగిన గణతంత్ర దినోత్సవం వేడుకల్లో కలెక్టర్ చేతన్ ప్రశంస పత్రాన్ని అందించారు. పుట్టపర్తి సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడటంలో సఫలత సాధించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. తన సిబ్బంది ప్రోత్సాహం వల్ల తనకు ఈ గౌరవం దక్కిందని విజయకుమార్ పేర్కొన్నారు. ఇప్పటి నుంచి రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానన్నారు.
Similar News
News December 7, 2025
SRPT: పోస్టల్ బ్యాలెట్ విధిగా వినియోగించుకోవాలి: కలెక్టర్

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను విధిగా వినియోగించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. ఎన్నికల సంఘం కల్పించిన ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని ఆయన కోరారు. ఆత్మకూరు (ఎస్), సూర్యాపేట సహా 8 మండలాల ఉద్యోగులు ఈ నెల 6 నుంచి 9వ తేదీలలో ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు వేయాలని స్పష్టం చేశారు.
News December 7, 2025
ALERT.. రేపటి నుంచి భారీగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో రేపటి నుంచి వారం రోజుల పాటు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 18 జిల్లాల్లో 9-12డిగ్రీలు, 12 జిల్లాల్లో 6-9 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయని అంచనా వేశారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని తెలిపారు. పగటి వేళల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు.
News December 7, 2025
సిరిసిల్ల: ఆల్ట్రా మారథాన్ రన్ లో పాల్గొన్న జిల్లా కానిస్టేబుల్

రాజస్థాన్లో నిర్వహించిన 100 కిలోమీటర్ల అంతర్జాతీయ ప్రమాణాల ఆల్ట్రా మారథాన్ రన్ లో జిల్లాకు చెందిన ఆర్ముడు రిజర్వ్ కానిస్టేబుల్ అనిల్ యాదవ్ పాల్గొన్నారని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. 100 కిలోమీటర్లు సాగిన ఈ రన్ లో అపారమైన ధైర్య సాహసాలు, శారీరక, మానసిక దృఢత్వాన్ని కానిస్టేబుల్ అనిల్ యాదవ్ ప్రదర్శించాడన్నారు. ఇటువంటి ఈవెంట్లో పాల్గొనడం ద్వారా యువ సిబ్బందికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు.


