News January 27, 2025

శ్రీ సత్యసాయి జిల్లా ఉత్తమ డీఎస్పీగా విజయ్ కుమార్

image

శ్రీ సత్యసాయి జిల్లా ఉత్తమ డీఎస్పీగా విజయ్ కుమార్ ఎంపికయ్యారు. ఆయనకు ఆదివారం పుట్టపర్తిలో జరిగిన గణతంత్ర దినోత్సవం వేడుకల్లో కలెక్టర్ చేతన్ ప్రశంస పత్రాన్ని అందించారు. పుట్టపర్తి సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడటంలో సఫలత సాధించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. తన సిబ్బంది ప్రోత్సాహం వల్ల తనకు ఈ గౌరవం దక్కిందని విజయకుమార్ పేర్కొన్నారు. ఇప్పటి నుంచి రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానన్నారు.

Similar News

News February 20, 2025

సిద్దిపేట: మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్

image

అత్యవసర సమయంలో ఒకరికి రక్త దానం చేసి మానవత్వాన్ని ఓ కానిస్టేబుల్ చాటాడు. సిద్దిపేట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో ” O ” పాజిటివ్ బ్లడ్ అవసరమైంది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ శేఖర్ వెంటనే మిత్ర బ్లడ్ బ్యాంక్ వెళ్లి రక్తదానం చేశాడు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వ్యక్తి కుటుంబ సభ్యులు కానిస్టేబుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

News February 20, 2025

గర్భాలు నిలబడటం లేదు!

image

వెనకటి తరాల వారు పదిమంది పిల్లల్ని కనేవారు. కానీ నేడు గర్భం దాల్చడమే గగనమవుతోంది. మరికొంతమందిలో గర్భాన్ని నిలబెట్టుకోవడం సమస్య అవుతోంది. రెండు మెట్లెక్కితే చాలు గర్భస్రావం అయిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారిన జీవనశైలి, స్త్రీపురుషులిద్దరిలోనూ తగినంత దృఢత్వం లేకపోవడం, ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణమని వివరిస్తున్నారు.

News February 20, 2025

ఉప్పల్: బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటేనే ఆరోగ్యం..!

image

సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే సాధారణ బరువు, బీపీ, షుగర్ నార్మల్ ఉండాలని ఉప్పల్ UPHC డాక్టర్లు అన్నారు. ఇవి నార్మల్ ఉంటే ఆరోగ్యకరమైన మనస్సు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లు, కాలేయం, గుండె ఆరోగ్యకరంగా ఉండి మన జీవనం పచ్చని ఆకులు కలిగిన చెట్టుల ఉంటుందన్నారు. అదే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే మానసిక రుగ్మతలు, క్యాన్సర్, గుండెపోటు,కిడ్నీ వైఫల్యాలతో ఎండిపోయిన చెట్టులా మన పరిస్థితి మారుతుందన్నారు.

error: Content is protected !!