News March 17, 2025
శ్రీ సత్యసాయి జిల్లా: ‘ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించాలి’

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఉపాధి హామీ పథకం కూలీలకు 10 వారాల బకాయిలు చెల్లించాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్కు వ్యవసాయ కార్మిక సంఘం నేతలు విన్నవించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ను కలసి వినతి పత్రం అందజేశారు.
Similar News
News November 21, 2025
NLG: కొత్త రూల్స్ అమలు.. దరఖాస్తులు షురూ

కంకర మిల్లులకు ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఓవర్ లోడ్తో వెళ్లే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సమూల మార్పులకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగానే క్రషర్ మిల్లులకు, ఖనిజాన్ని సరఫరా చేసే వాహనాల విషయంలో కొత్త రూల్స్ అమలు చేసింది. దీంతో జిల్లాలో 20 క్రషర్ మిల్లుల యజమానులు, 150 టిప్పర్ల యజమానులు కూడా తిరిగి రిజిస్ట్రేషన్ కోసం మైనింగ్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు.
News November 21, 2025
ADB: లోకల్ వార్.. అయోమయంలో బీసీలు

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం మళ్లీ కసరత్తు ప్రారంభించింది. గతంలో ఇచ్చిన రిజర్వేషన్లపై ప్రతిష్ఠ కొనసాగుతుండటంతో పార్టీ పరంగా 42% బీసీలకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు ఆమోదించాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1514 GPలు, 581 ZPTC, 69 MPTC స్థానాలు ఉండగా.. బరిలో నిలవాలనుకున్న బీసీలు అయోమయంలో ఉన్నారు.
News November 21, 2025
వరంగల్: రేపు జాబ్ మేళా

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి బి. సాత్విక కోరారు. ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ వద్ద ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉండి, ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ మేళాకు అర్హులన్నారు.


