News March 17, 2025
శ్రీ సత్యసాయి జిల్లా: ఐసీడీఎస్ పీడీగా శ్రీదేవి బాధ్యతలు స్వీకరణ

శ్రీ సత్యసాయి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్గా శ్రీదేవి బాధ్యత స్వీకరించారు. తాడిపత్రిలో పనిచేస్తున్న శ్రీదేవి పదోన్నతిపై శ్రీ సత్యసాయి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్గా నియమితులయ్యారు. సోమవారం పీడీగా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఆమె కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు.
Similar News
News March 18, 2025
VKB: నిరీక్షణకు ఫలితం దక్కింది

దుద్యాలకి చెందిన మాసుల పద్మమ్మ, చిన్న సాయన్న కొడుకు మాసుల శశివర్ధన్ నిరీక్షణకు ఫలితం దక్కింది. 11 సంవత్సరాలుగా విద్యాశాఖలో సీఆర్పిగా విధులు నిర్వర్తిస్తూ చదివి హాస్టల్ వెల్ఫేర్ జాబ్ సాధించాడు శశివర్ధన్. తల్లిదండ్రులు కలను నెరవేర్చాడు. అతణ్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.
News March 18, 2025
భారీ లాభాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 736 పాయింట్ల లాభంతో 75,047 వద్ద ట్రేడ్ అవుతుంటే, నిఫ్టీ 255 పాయింట్ల లాభంతో 22,764 వద్ద కదలాడుతోంది. జొమాటో, ఐసీఐసీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, HUL, L&T షేర్లు లాభాల్లో ఉన్నాయి.
News March 18, 2025
సిద్దిపేట: ‘కుటుంబమే విద్యార్థుల వికాసానికి పునాది’

కుటుంబంలోని తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల ప్రభావం విద్యార్థులపై బలంగా ఉంటుందని ప్రముఖ మనో వికాస శాస్త్రవేత్త, విద్యా కౌన్సిలర్ డాక్టర్ సి. వీరేందర్ అన్నారు. సిద్దిపేటలో నిన్న జరిగిన ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉత్తమ విద్యార్థులను తయారు చేయడానికి కుటుంబం పునాది వంటిదని అన్నారు.