News April 1, 2025

శ్రీ సత్యసాయి జిల్లా ఫ్యాఫ్టో నూతన కార్యవర్గం ఎన్నిక

image

ఏపీ ఉపాధ్యాయుల సంఘాల సమైక్య ఫ్యాఫ్టో ఛైర్మన్ కోడూరు శ్రీనివాసులు అధ్యక్షతన సోమవారం అంతర్జాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. జిల్లా ఫ్యాఫ్టో ఛైర్మన్ ఎన్‌పి కుంటకు చెందిన గజ్జల హరిప్రసాద్ రెడ్డి, సెక్రటరీగా గౌస్ లాజం, కోశాధికారి భాస్కర్ రెడ్డితో పాటు మరో ఆరుగురిని ఎన్నికున్నారు. సభ్యులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Similar News

News November 25, 2025

నేపాల్‌లో 8 మంది పామూరు యువకులు అరెస్టు

image

బెట్టింగుల కోసం దేశాలు దాటి పామూరు యువకులు జైలు పాలైన సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. నేపాల్ దేశంలో జరుగుతున్న ఎన్పీఎల్ క్రికెట్‌పై ఆన్‌లైన్‌లో బెట్టింగ్ కాసేందుకు పామూరుకు చెందిన 8 యువకులు బెంగుళూరు నుంచి విమానం ద్వారా నేపాల్‌కి చేరుకున్నట్లు సమాచారం. నేపాల్‌కి వెళ్లెందుకు పాస్‌పోర్ట్ అవసరం లేకపోవడంతో ఆధార్ కార్డుపై నేపాల్ వెళ్లారు. పోలీసుల పక్కా సమాచారంతో 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News November 25, 2025

హీరో అజిత్‌కు ‘జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

image

సినిమాల్లో నటిస్తూనే ప్రొఫెషనల్ కార్ రేసర్‌గానూ హీరో అజిత్ రాణిస్తున్నారు. కార్ రేసింగ్ ఇండస్ట్రీలో సాధించిన విజయాలు, ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ ట్రాక్‌లో ఇండియా ప్రతిష్ఠను పెంచినందుకు ‘జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారాన్ని ఫిలిప్ చారియోల్ మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ అందజేసింది. ఇటలీలో జరిగిన కార్యక్రమంలో అజిత్‌కు SRO మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ సీఈవో స్టెఫాన్ రాటెల్ అవార్డు అందజేశారు.

News November 25, 2025

అఫ్గాన్‌పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్.. 10 మంది మృతి

image

అఫ్గానిస్థాన్‌తో వివాదం వేళ ఆ దేశంపై పాకిస్థాన్ అర్ధరాత్రి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఖోస్త్, పాక్టికా, కునార్ ప్రావిన్స్‌లో మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. దీంతో 10 మంది అఫ్గాన్ పౌరులు మరణించగా నలుగురు గాయపడ్డారు. మృతుల్లో 9 మంది చిన్నారులే కావడం విషాదకరం. అఫ్గాన్ తమను లెక్కచేయకపోవడం, భారత్‌కు దగ్గరవుతుండటాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి దొంగదెబ్బ తీసింది.