News January 25, 2025
శ్రీ సత్యసాయి జిల్లా రౌండప్

☞ నేడు ‘మెము’ రైలు రద్దు
☞ మోసం కేసులో కదిరిలో ఇద్దరి అరెస్ట్
☞ అంతర్జాతీయ జూడో పోటీలకు చిగిచెర్ల విద్యార్థి
☞ కదిరి జాబ్ మేళాలో 62మందికి ఉద్యోగాలు
☞ రిపబ్లిక్ ఉత్సవాలకు లేపాక్షి విద్యార్థి సాయి కిరణ్‌కు ఆహ్వానం
☞ జాగ్రత్త: పెనుకొండలో సచివాలయ ఉద్యోగినంటూ మోసాలు
☞ క్వింటా రూ.7,550లతో చిగిచెర్లలో కందుల కొనుగోలు
Similar News
News February 9, 2025
కప్పట్రాళ్ల సమీపంలో ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి దుర్మరణం

దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామ సమీపంలో శనివారం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. గోనెగండ్ల మండలం బోదెపాడుకు చెందిన బోయ హనుమంతు, రంగమ్మ దంపతుల కుమారుడు జగదీశ్(25) ఉల్లిగడ్డ లోడుతో వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదంలో జగదీశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి కుమారుడు ఉండగా.. భార్య 5 నెలల గర్భవతి. ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News February 9, 2025
క్రికెట్ టోర్నమెంట్‌లో సూర్యాపేట స్ట్రైకర్స్ విజయం

ఎస్బీఐ ఇంట్రారీజియన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఎస్బీఐ రీజినల్ మేనేజర్ వై. ఉపేంద్ర భాస్కర్ శనివారం ప్రారంభించారు. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్యాంకింగ్ బ్లాస్టర్స్ 100 పరుగులు చేయగా, సూర్యాపేట స్ట్రైకర్స్ బ్యాట్స్‌మెన్ ఏఎన్ఆర్ చివరి మూడు బంతుల్లో 13 పరుగులు చేసి 101 పరుగులతో సూర్యాపేట స్ట్రైకర్స్ జట్టును విజేతగా నిలిపారు.
News February 9, 2025
అరకు: మన్యం బంద్‌కు సీపీఎం మద్దతు

మన్యం బంద్ ఫిబ్రవరి 11, 12 తేదిల్లో జరుగనున్నది. దానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని అరకులోయ సీపీఎం మండల కార్యదర్శి రామారావు తెలిపారు. ఈ మేరకు ఆయన మన్యం బంద్ జయప్రదం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం అఖిలపక్ష ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు విస్తృతంగా పంచారు. ఆదివాసిల 1/70 చట్టాన్ని సవరించాలని రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.