News February 22, 2025

శ్రీ సత్యసాయి: తెలుగు టీచర్ సస్పెండ్

image

తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యనారాయణ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో సూర్యనారాయణ రెడ్డి అరెస్టై అనంతపురం జిల్లా జైలులో ఉన్నారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతడిని సస్పెండ్ చేశామన్నారు.

Similar News

News February 23, 2025

అనంతపురంలో కిలో చికెన్ రూ.120

image

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అనంతపురంలో ఇవాళ కిలో చికెన్ రూ.120-140 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.350-400, మటన్ కిలో రూ.700-800లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

News February 23, 2025

అనంతపురంలో కిలో టమాటా రూ.10

image

అనంతపురంలో కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న కిలో టమాటా రూ.10 పలికింది. సరాసరి ధర రూ.8, కనిష్ఠ ధర రూ.7తో విక్రయాలు జరిగాయి. టమాటా కోత కూలీలు, ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.
➤ ఇక చీనీ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నిన్న టన్ను గరిష్ఠంగా రూ.20,700 తో అమ్ముడయ్యాయి.

News February 23, 2025

అనంతపురం జిల్లాలో 14 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

image

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. అనంతపురం జిల్లాలో 14 కేంద్రాల్లో 7,293 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.

error: Content is protected !!